బాధితులకు ప్రభుత్వము అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడలో సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబాన్ని సభ్యులతో కలిసి పరామర్శించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.