ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. దూరప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.