బాలకృష్ణకు ఐఫా-2024 పురస్కారం
NEWS Sep 28,2024 05:58 am
నందమూరి బాలకృష్ణకు ఐఫా-2024 వేడుకల్లో అరుదైన పురస్కారం దక్కింది. అబుదాబిలో జరుగున్న వేడుకల్లో ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు ఇచ్చే ముందు బాలకృష్ణ పాదాలకు కరణ్ నమస్కరించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, వెంకటేశ్ సైతం హాజరయ్యారు.