అనుమానస్పదంగా నలుగురు వ్యక్తులు
పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
NEWS Sep 28,2024 05:32 am
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో నలుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో అనుమానస్పదంగా తిరగటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. వారు ఎక్కడినుండి వచ్చారు, ఎక్కడ పని చేస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.