‘దేవర’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
NEWS Sep 28,2024 04:47 am
ఎన్టీఆర్ మూవీ ‘దేవర’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఐతే ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అన్ని భాషలలో కలిపి రూ.77 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, తమిళంలో రూ.0.8 కోట్లు, మలయాళంలో రూ. 0.3 కోట్లు వచ్చినట్లు సమాచారం. రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లో ఓవర్సీస్ మార్కెట్‌ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఉంది.