ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు
NEWS Sep 28,2024 04:40 am
ఏపీలో అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా ఇవే రోజుల్లో సెలవులు ఉండనున్నాయి.