మరోసారి భారత్ పై విషం చిమ్మిన పాక్
NEWS Sep 28,2024 04:30 am
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని, కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరపాలని కోరారు. 20 నిమిషాల ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలివేసి కేవలం కశ్మీర్ గురించే ఎక్కువగా మాట్లాడాడు. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్చ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారన్నారు.