తూప్రాన్: అనుమానాస్పదంగా ఒకరు మృతి
NEWS Sep 28,2024 04:32 am
తూప్రాన్ పట్టణంలో ఇస్లాంపూర్ చెందిన వ్యక్తి అనుమాన స్పదంగా మృతి చెందాడు. శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన అంసానిపల్లి శ్రీనివాసరెడ్డి (50) కొన్నేళ్లుగా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ లో నివాసం ఉంటున్నాడు. తూప్రాన్ పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద గల లిక్కర్ మార్ట్ సమీపంలో రాత్రి సమయంలో అనుమానస్పదంగా మృతి చెందాడు. తూప్రాన్ పోలీసులు శవాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు