30న జిల్లాస్థాయి డ్రామా ఫెస్టివల్ పోటీలు
NEWS Sep 28,2024 04:47 am
సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఈ నెల 30వ తేదీన జిల్లా స్థాయి డ్రామా ఫెస్టివల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. మానవజాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతిక అంశంపై డ్రామా పోటీలు జరుగుతాయని చెప్పారు. ఒక్కో టీంలో 8 మంది విద్యార్థులకు మించకూడదని పేర్కొన్నారు. ప్రతిప చూపిన వారిని రాష్ట్రస్థాయికి పంపిస్తామని తెలిపారు.