పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో ఎంపీకి స్థానం
NEWS Sep 28,2024 04:35 am
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు స్థానం దక్కింది. పబ్లిక్ గ్రీవెన్స్ లా అండ్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా అవకాశం కల్పించారు. ఎంపీ మాట్లాడుతూ తనకు స్టాండింగ్ కమిటీలో చోటు కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తారని చెప్పారు.