గీతం విద్యార్థిని హాస్టల్లో సూసైడ్
NEWS Sep 28,2024 04:49 am
గీతం యూనివర్సిటీ విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటిలో ఈ ఘటన జరిగింది.బీటెక్ CSC సెకండ్ ఈయర్ చదువుతున్న విద్యార్థిని వర్ష (19) హాస్టల్ రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి వర్ష అనంతపురం జిల్లాకు చెందిందిగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.