రైతు వేదికలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ
NEWS Sep 27,2024 05:46 pm
మల్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో అదికారులు CMRF, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హాజరైన MLA మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లికి సాయంగా అందజేసే నగదుతో పాటు తులం బంగారం హామీ త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో MRO మునిందర్, కాంగ్రెస్ నాయకులు ఆనంద రెడ్డి, ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్, రవళివంశీధర్, శంకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.