శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా వరద బాధితులకు రూ.25 లక్షలు సాయం
NEWS Sep 27,2024 05:28 pm
సీఎం చంద్రబాబుతో నటుడు, నిర్మాత మోహన్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్ఎఫ్‌కి శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు నుంచి రూ.25 లక్షల చెక్కును వెలగపూడి సెక్రటేరియేట్‌లో చంద్రబాబుకు మోహన్‌బాబు అందజేశారు. ఆయన వెంట మా అధ్యక్షుడు, తనయుడు మంచు విష్ణు కూడా ఉన్నారు.