భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదే
టూరిజం హబ్‌గా ఏపీ: మంత్రి దుర్గేష్
NEWS Sep 27,2024 05:15 pm
ఏపీని పర్యాటకానికి గమ్యస్థానంగా మారుస్తామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెయ్యి కోట్లతో టూరిజం అభివృద్ధి చేస్తామని, ఒక్క అమరావతిలోనే మెగా టూరిజం పేరుతో రూ.500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్, సంగమేశ్వరం లాంటి ప్రాంతాలను ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లుగా మార్చుతామన్నారు. విజయవాడలో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే-2024 వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.