జగన్‌ను తిరుమల రావొద్దని ఎవరైనా అన్నారా?
డిక్లరేషన్ సాకుతోనే వెళ్లలేదు: సీఎ: చంద్రబాబు
NEWS Sep 27,2024 05:02 pm
శ్రీవారిపై భక్తి ఉండే ఎవరికైనా తిరుమల వెళ్లే స్వేచ్చ ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఇతర మతాలకు చెందిన వారెవరైనా వెళ్తే అక్కడి సాంప్రదాయాలు పాటించాలన్నారు. తిరుమలకు రావొద్దని మేం అన్నట్టు జగన్ మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే ఆయన వెళ్లలేదు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటం సబబు కాదని చంద్రబాబు విమర్శించారు.