అడవుల సంరక్షణకు ఏపీ, కర్ణాటక ఒప్పందం
NEWS Sep 27,2024 04:40 pm
కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ , కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు 2 రాష్ట్రాల మధ్య అడవుల పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణ, గిరిజనులకు శిక్షణ, సమాచార మార్పిడి, కుంకీ ఏనుగుల సమస్య, ఎకో టూరిజం వంటి కీలకమైన అంశాలపై పరస్పరం సహకరించుకుంటారు.