బతుకమ్మ కానుకగా నగదు గిఫ్ట్
NEWS Sep 27,2024 04:35 pm
హైదరాబాద్: గత ప్రభుత్వం ఏటా బతుకమ్మ కానుక కింద ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు రూ.500 చొప్పున నగదు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా మహిళల అకౌంట్లలోనే ఈ డబ్బు జమ చేయాలని ప్లాన్ చేశారట.