కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుక
NEWS Sep 27,2024 04:15 pm
మల్యాల మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు పద్మశాలి సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చొప్పదండి MLA మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా 3దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, వెంకన్న, కాంగ్రెస్ నాయకులు ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, రవళి, శ్రీనివాస్, CI నీలం రవి పాల్గొన్నారు.