లక్షమందితో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం
NEWS Sep 27,2024 01:14 pm
హైడ్రా విషయంలో హైకోర్టుకు వెళతామని, చూస్తూ ఊరుకునేది లేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే బీజేపీ సామాన్యుల పక్షాన నిలుస్తుందని, లక్షమందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. పేదల కన్నీటితో ఆడుకుంటే పతనం తప్పదని హెచ్చరించారు. న్యూమారుతీ నగర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఈటల పర్యటించి, బాధితులను పరామర్శించారు.