విద్యార్థుల సమయానికి బస్సు నడపాలి
NEWS Sep 27,2024 12:46 pm
విద్యార్థుల సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యులు జగన్ పేర్కొన్నారు. తూప్రాన్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్టీసీ కంట్రోలర్ కు వినతిపత్రం అందజేశారు. గజ్వేల్ నుంచి వచ్చే బస్సులు సమయపాలన పాటించడం లేదని, వెల్దుర్తి బస్సు కొద్దిరోజులుగా రావడంలేదని, సంగారెడ్డి నుంచి వచ్చే బస్సులు సాయంత్రం వేళ సమయానికి రావడం లేదని పేర్కొన్నారు.