పానీపూరి బండ్లపై మున్సిపల్ అధికారులు దాడులు
NEWS Sep 27,2024 12:47 pm
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాలతో పానీపూరి బండ్లపై దాడులు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు చెక్ చేశారు అధికారులు. నాణ్యత పాటించని వారికి 4000 జరిమానా విధించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పానీ పూరి మాస్టర్ హ్యాండ్ చేతులకు గ్లౌజులు లేనందున, ప్లాస్టిక్ కవర్ వాడుతున్నందున జరిమానా విధించామని అధికారులు తెలిపారు. పానీ పూరి నిర్వహించే యజమానులు చేతులకు గ్లౌజులు ధరించి ఉండాలని, ప్లాస్టిక్ కవర్ వాడవద్దు, మంచి నీళ్లు వాడాలని సూచించారు.