అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి
NEWS Sep 27,2024 01:12 pm
జిల్లాలో అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మానిక్, ఆందోలు డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు.