అక్టోబర్ 4న చలో జగిత్యాల కలెక్టరేట్
NEWS Sep 27,2024 12:05 pm
మెట్ పల్లి: అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి తరలి రావాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతు నాయకులు శుక్రవారం పిలుపునిచ్చారు. మెట్ పల్లి మండలం మేడిపల్లి, రాజేశ్వరరావు పేట, సత్తక్కపల్లి, సంస్థాన్ బండలింగాపూర్, జగ్గసాగర్, ఆత్మకూర్, కొండ్రికర్ల, మెట్ల చిట్టాపూర్, కొనరావుపేట్, చౌలమద్ది, పెద్దాపూర్ గ్రామలలో రైతులతో సమావేశమై అధిక సంఖ్యలో రైతులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు రమేష్, తిరుపతి తదితరులు ఉన్నారు.