దసరా నవరాత్రుల ఉత్సవాల కమిటీ మీటింగ్
NEWS Sep 27,2024 12:00 pm
మెట్ పల్లి పట్టణంలో గల అతి పురాతనమైన చెన్నకేశవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల ఉత్సవాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దసరా నవరాత్రి ఉత్సవాలు దసరా కార్యక్రమాలు అందరూ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది, కుల సంఘాలు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పూజారి కృష్ణమాచారి, మహాజన్ నర్సింలు, పొట్ట ప్రేమ్, గోరుమంతుల సురేందర్, కుల సంఘ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.