రెండు లక్షల రైతురుణమాఫీ వెంటనే చేయాలి
NEWS Sep 27,2024 01:13 pm
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు అన్నారు. ఈ సందర్భంగా జోగిపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి అనంతరం మాట్లాడారు.ప్రభుత్వం రెండు లక్షల రుణాలు మాఫీ చేసామని అని చెబుతున్న నేటికీ రుమాఫీ కాక కొత్త రుణాలు చేతికందక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. జిల్లాలో అనేకమంది మాఫీ కోసం, రైతు భరోసా డబ్బులు కోసం సైతం ఎదురుచూస్తున్నారని అన్నారు.