అమ్మవారికి ప్రత్యేక పూజలు
NEWS Sep 27,2024 12:50 pm
కథలాపూర్ మండల కేంద్రంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో జరగబోతున్న నేపథ్యంలో అమ్మవారి షెడ్డుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కథలాపూర్ గ్రామంలోని ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవలో పాల్గొనాలని దుర్గాదేవి నవరాత్రి కమిటీ సభ్యులు తెలిపారు. దుర్గాదేవి నవరాత్రి కమిటీ సభ్యులందరూ 9 రోజులు నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజిస్తారని, అమ్మవారికి వేడుకున్న వారికి కొంగు బంగారం అవుతుందని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో వర్దినేని నాగేశ్వరరావు, తాజా మాజీ సర్పంచ్ సత్యనారాయణ నీరజ, చిలుకఅశోక్, శాంతారామ్ తదితరులు పాల్గొన్నారు.