జీవో నెంబర్ 25 ఉపసంహరించుకోవాలి
NEWS Sep 27,2024 12:34 pm
జీవో నెంబర్ 25 ఉపసంహరించుకొని ప్రాథమిక పాఠశాలలను పరిరక్షించాలని దత్తాత్రి డిమాండ్ చేశారు. హత్నూర లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే పిఆర్సి ప్రకటించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డియర్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. జిల్లా గౌరవ అధ్యక్షులు గోపాల్, నాయకులు నర్సింహారెడ్డి, సత్యనారాయణ, శ్రీ వర్ధన్ పాల్గొన్నారు.