రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్
NEWS Sep 27,2024 10:36 am
చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితోనే క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని.. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. నేను తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్తుంటే మా పార్టీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా?’’ అని జగన్ ప్రశ్నించారు.