ఆవాలతో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రం
NEWS Sep 27,2024 12:04 pm
ఉద్యమ శిఖరం, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్బంగా వినూత్నంగా అవాలను ఉపయోగించి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు అత్య అద్భుతంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని చిత్రీకరించారు. కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తికి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు కొండ లక్ష్మణ బాపూజీ అని కొనియాడారు.