చదువులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి
NEWS Sep 27,2024 04:26 pm
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. సదాశివపేట మండలం ఆరూరు ప్రాథమిక పాఠశాలను శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు అమలవుతున్న మధ్యాహ్న భోజనం చూశారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు.