ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
NEWS Sep 27,2024 12:47 pm
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, కంది మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు విట్టల్, చిన్న, శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు.