వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
NEWS Sep 27,2024 12:51 pm
ఊహించని రీతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారి దర్శనానికి వెళ్లాలని హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి. టీటీడీ అధికారులు కూడా డిక్లరేషన్ అడుగుతారన్న పక్కా సమాచారంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు పర్యటన రద్దుపై కాసేపట్లో జగన్ మీడియాతో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.