ఘనంగా కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు
NEWS Sep 27,2024 12:39 pm
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వరాష్ట్రం కోసం తపించిన తెలంగాణ వాది, బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్ర్య సమరయోధుని త్యాగాలను కొనియాడారు. ఈకార్యక్రమంలో వాసం శ్రీనివాస్, సిందం శ్రీనివాస్, రమేష్, బింగి నరేష్, పోతు శంకర్ తదితరులు పాల్గొన్నారు.