అయ్యా బాబోయ్ కుక్కలు...
NEWS Sep 27,2024 12:07 pm
కుక్కలు రెచ్చిపోతున్నాయి, రోడ్డుపై ప్రజలు వెళ్లాలంటే భయపడుతున్నారు. గుంపులు గుంపులుగా రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్ లో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు చెబుతున్నారు, ఉదయం నుండి రాత్రి వరకు వందల సంఖ్యలో కుక్కలు రోడ్లపై తిరుగుతున్నాయని పిల్లలు రోడ్డుపై ఆడుకునేందుకు రావటం భయంగా మారిందని చెపుతున్నారు. బైక్ పై వెళ్లే వారిని వెంబడించి దాడికి పాల్పడుతున్నాయన్నారు వెంటనే కుక్కల బెడద నుండి తమ కాలనీని రక్షించాలని కోరుతున్నారు.