ముగిసిన నీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం
NEWS Sep 27,2024 12:16 pm
జగిత్యాల మండల కేంద్రంలోని సమావేశ మందిరంలో గ్రామ మంచి నీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్ మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల నుండి ఒక్కొక్క గ్రామ మంచి నీటి సహాయకులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు నైపుణ్య శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా 4 అంశాలపై 4 రోజుల పాటు సహాయకులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు.