ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
NEWS Sep 27,2024 12:08 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితం సమాజానికి అంకితం చేసిన మహానీయుడని పలువురు కొనియాడారు.