చెరువులో పడి పశువుల కాపరి మృతి
NEWS Sep 27,2024 12:38 pm
బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన సుంకే పద్ద గంగయ్య(58) అనే వ్యక్తి పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పశువులను గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్తుండగా ఒక పశువు స్థానిక చెరువులోకి వెళ్ళింది. చెరువు నుండి బయటకు తరమడానికి గంగయ్య చెరువులో దిగగా ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతుడికి భార్య లచ్చవ్వ ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.