కొండా లక్ష్మణ్ బాపూజీకి కలెక్టర్ ఘన నివాళులు
NEWS Sep 27,2024 12:49 pm
తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు, తెలంగాణ సోయి కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణా ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ పక్కన ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురిలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం చేసిన పోరాటం మరువలేనిదన్నారు.