కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోనే తెలంగాణ
NEWS Sep 27,2024 12:36 pm
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పరితపించిన తొలితరం ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ 109 జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ అంగడి బజార్ లో ఎమ్మెల్యే సంజయ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం అన్నారు.