సబ్సిడీ గ్యాస్ సర్టిఫికెట్లను అందజేసిన జువ్వాడి
NEWS Sep 27,2024 12:41 pm
మెట్ పల్లి పట్టణంలోని 2వ వార్డులో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ యమ రాజయ్యతో కలిసి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. గత శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందజేయడం జరుగుతుందని తెలిపారు.