పొంచి ఉన్న ప్రమాదం..
పట్టించుకోని అధికారులు..
NEWS Sep 27,2024 12:26 pm
మెట్ పల్లి మండలంలోని జగ్గాసాగర్ - ఆత్మకూర్ రూట్ లోని దొంగల మర్రి సమీపంలో దారి ప్రక్కన గల బావి ప్రమాదకరంగా ఉంది. ఆ బావికి రక్షణ గోడ లేకపోవడంతో రోజు ప్రయాణించే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మూలమలుపు కావడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ప్రయాణికులు భయందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో, వాహనదారులు నామ మాత్రంగా రాళ్లను అడ్డుగా పెట్టారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.