ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
NEWS Sep 27,2024 12:18 pm
స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో ఆకాక్షించారని అదనపు కలెక్టర్ పి. రాంబాబు తెలిపారు. శుక్రవారం జగిత్యాల కలెక్టరెట్ ప్రాంగణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా జిల్లా వెనుకబడిన తరగతి అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులార్పించారు.