బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం
NEWS Sep 27,2024 02:29 pm
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.