వరద బాధితులకు రిలయన్స్ సాయం
NEWS Sep 27,2024 06:43 am
తెలంగాణలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ తరఫున రూ.20 కోట్ల విరాళం ప్రకటించింది. రిలయన్స్ కంపెనీ యజమాని ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ తరఫున వచ్చిన ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కంపెనీ తరఫున రూ.20 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.