హైదరాబాద్‌లో 15 చోట్ల ఈడీ సోదాలు
NEWS Sep 27,2024 05:23 am
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని 15 ప్రాంతాల్లో ED ఉదయం సోదాలు నిర్వహించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో మంత్రి నివాసంలోనూ దాడులు చేసినట్టు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు, ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులను ఈడీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.