మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో షాక్
NEWS Sep 27,2024 06:02 am
గజ్వేల్ నియోజకవర్గం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పురం మహేష్ బిజెపిలో చేరారు. ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ కండువాను కప్పారు. ముప్పిరెడ్డిపల్లి మాజీ ఉపసర్పంచ్ సత్యనారాయణ, మరికొందరు పార్టీలో చేరారు. పార్టీ నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, బాశబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు