బంగారం ధర - సరికొత్త రికార్డు
NEWS Sep 27,2024 05:18 am
బంగారం ధర ఏకంగా ₹ 78 వేల ఆల్‌టైం హై నమోదు చేసింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా ₹ 77,450 ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ₹ 71,000 గా ఉంది. వెండిపైనా కిలోకు రూ. 1000 పెరిగి రూ. 94 వేలను తాకింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని, రూ. 80 వేల మార్కును కూడా తాకవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.