MLC దంపతులకు ముత్యాల తలంబ్రాలు
NEWS Sep 27,2024 06:01 am
ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి దంపతులకు భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు స్వామి వారి శేషవస్త్రాలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అందజేశారు. ఈ సందర్బంగా యాదవరెడ్డి మాట్లాడుతూ.. భద్రాచల ముత్యాల తలంబ్రాలు అందుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమో అన్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తమ వంతు వడ్లను ఓలిచి రామకోటి రామరాజుకు అందించామన్నారు. తిరిగి ముత్యాల తలంబ్రాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.