30 రోజుల్లో డిజిటల్ హెల్త్‌కార్డులు: సీఎం
NEWS Sep 26,2024 05:36 pm
నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని, దీంతో పాత వ్యాధుల వివరాలను సులభంగా ట్రాక్ చేయవచ్చన్నారు. ఏ రకంగా వైద్యులు ట్రీట్ చేసున్నారో కూడా తెలుస్తుంది. దీంతో డాక్టర్ నెక్స్ట్ ఏ రకంగా ముందుకు వెళ్లాలో వెసులుబాటు కలుగుతుంది.