మండపేటలో ఫోక్సో కేసులో వ్యక్తి అరెస్ట్
NEWS Sep 26,2024 06:07 pm
మండపేట మండలం ద్వారపూడి వేములపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 6 నెలల నుండి బాలికను ప్రేమ పేరుతో వేధించి, ఆమెను బెదిరించి, బలవంతంగా మానభంగం చేసిన రాజానగరం మండలం తుంగపాడు కు చెందిన లోశెట్టి సతీష్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.